వివాదాస్పద నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌పై మరో బాంబ్ విసిరింది. తనకు భద్రత కల్పిస్తే టాలీవుడ్ లోని డ్రగ్స్ రాకెట్ విషయాలు బయటపెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది. గతంలో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ అనే అంశంపై ఎంతరచ్చ చేసిందో తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖలపై విరుచుకు పడింది. టాలీవుడ్లో కొందరు మూవీ మాఫియాగా మారి చిన్న హీరోలను తొక్కేస్తున్నారని, వేషాల ఎరవేసి అమ్మాయిలతో కోరికలు తీర్చుకుంటున్నారని పెద్ద వివాదమే రేపింది. అయితే డ్రగ్స్ గురించి నేను అప్పట్లోనే చెప్పానంటోంది. చాలామంది సెలెబ్రెటీలు రేవ్ పార్టీలు నిర్వహిస్తూ విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుంటున్నారనే విషయం నాకు తెలుసు అంటోంది శ్రీరెడ్డి .
తనకు భద్రత కల్పిస్తే టాలీవుడ్ లో డ్రగ్స్ వాడే వారి పేర్లు బయటపెడతానంటోంది. పెద్ద పెద్ద హోటళ్లలో పార్టీలంటూ డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. ఆ పార్టీలకు వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వారిని వాడుకుంటున్నారని శ్రీరెడ్డి తెలిపింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ విషయంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం బాగుందని శ్రీరెడ్డి తెలిపింది. దేశ సినీ పరిశ్రమ ప్రతిష్టకు మచ్చ రాకుండా కేంద్రం చేపట్టిన దర్యాప్తుపై ఆమె ప్రశంసల జల్లు కురిపిస్తోంది. అలాగే టాలీవుడ్‌పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటోంది ఈ హాట్ బ్యూటీ.