వివాదస్పద నటి శ్రీరెడ్డి మాజీ ప్రియుడిపై సంచలన ఆరోపణలు చేస్తూ.. ఓ వీడియో వదిలింది. తన మాజీ ప్రియుడు, దగ్గుబాటి అభిరామ్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో దేవుడు ఉన్నాడ్రా అభిరామ్ అంటూ తన గతాన్ని గుర్తుచేసుకుంది శ్రీరెడ్డి.
శ్రీరెడ్డి షేర్ చేసిన వీడియోలో.. అభిరామ్ గతంలో తనను అన్న మాటల్ని గుర్తుచేసింది. ‘అభి (దగ్గుబాటి అభిరామ్) నీకు గుర్తుందా.. నీ కారు ఎంత? నీ స్థాయి ఎంత? నేను రానా తమ్ముడ్ని.. సురేష్ బాబు కొడుకుని.. రామానాయుడు మనువడ్ని.. నీదో డొక్కు కారు.. నువ్వు ఆఫ్ట్రాల్ రోడ్ సైడ్ యాక్టర్స్వి.. అని అన్నావు. నన్నూ, నా కార్ని అవమానించావ్. ఈరోజు నీ కారుకి ఏదో యాక్సిడెంట్ అయినట్టు ఉంది. దేవుడు ఉన్నాడ్రా.. దేవుడు ఉన్నాడు. ఎప్పుడూ మిడిసిపడకు. డబ్బు, పేరు, అందం శాశ్వతం కాదురా మంచి పేరు, మంచితనమే శాశ్వతంగా ఉంటాయి. ఎదుటి వాళ్లని అర్థం చేసుకోవడం వాళ్లకి అపకారం చేయకుండా ఉండటం మంచిగా బతకడం నేనైతే ఉత్తమురాలిని కాకపోవచ్చు కాని.. నేను నీకు చెప్పినవాటిని ఫాలో అవుతున్నాను నేర్చుకుంటున్నాను’ అంటూ ఎమోషనల్ అవుతూ తన ఫేస్ బుక్ ద్వారా వీడియో విడుదల చేసింది శ్రీరెడ్డి.