HomeTelugu Trending‘శ్రీరెడ్డి దొరికిపోయింది’.. ఫస్ట్‌లుక్‌

‘శ్రీరెడ్డి దొరికిపోయింది’.. ఫస్ట్‌లుక్‌

1
వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. పేరుతో టాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆర్యన్‌, ఉపాసన జంటగా రాహుల్‌ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరెడ్డి దొరికిపోయింది’. మానవ మృగాలకు అనేది ఉపశీర్షిక.

న్యూఇయర్‌ కానుకగా మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ కాసేపటి క్రితం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టైటిల్‌ కాస్త వెరైటీగా ఉండటంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్వంత్‌ మూవీస్‌ పతాకంపై డి. వెంకటేష్‌ నిర్మిస్తున్నారు. గణేశ్‌ రాఘవేంద్ర సంగీతమందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు శ్రీరెడ్డికి సంబంధలేకపోయినప్పటికీ.. టైటిల్‌పై ఆమె అభ్యంతరం తెలిపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu