HomeTelugu Trendingబిగ్‌బాస్‌పై శ్రీరెడ్డి కామెంట్స్

బిగ్‌బాస్‌పై శ్రీరెడ్డి కామెంట్స్

Sri reddy controversial com
కాంట్రవర్సీలకు కేరాఫ్ శ్రీరెడ్డి అనే విషయం అందరికీ తెలిసిందే. శ్రీరెడ్డి జోలికి వెళ్లాలంటే ఎవరైనా భయపడాల్సిందే. అంతలా టెర్రర్ అయిపోయింది శ్రీరెడ్డి. ఎవరినీ వదలని శ్రీరెడ్డి కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉంది. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్‌4పై కామెంట్స్ చేసింది. బిగ్‌బాస్ కాన్సెప్ట్ నాకు అస్సలు నచ్చదు అందులో అందరూ దొంగ ఏడుపులే ఏడుస్తారని అంటోంది శ్రీరెడ్డి. తనకు అవకాశం వచ్చుంటే అసలు రియాలిటీ ఏమిటో చూపించేదాన్ని అంటుంది. హౌస్‌లో అంతా స్ర్కిప్ట్ ప్రకారమే జరుగుతుంటుందని ఆరోపించింది. బిగ్‌బాస్ సీజన్‌2లోనే శ్రీరెడ్డికి అవకాశం ఇస్తారని అనుకున్నారు. అయితే నాని హోస్ట్‌గా ఉండటం వల్లే ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. నాని, శ్రీరెడ్డి మధ్య వివాదం ప్రేక్షకులకు తెలిసిందే. ఎవరినైనా ఏదొకటి అనకపోతే శ్రీరెడ్డికి తోచదు అందుకే ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్‌4పై కామెంట్స్ చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu