HomeTelugu Big Storiesపెళ్లి చేసుకున్న శ్రీరెడ్డి?

పెళ్లి చేసుకున్న శ్రీరెడ్డి?

4 16
సంచలన నటి శ్రీరెడ్డికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే శ్రీరెడ్డి సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుంది అని.. తాజాగా ఆమె విడుదల చేసిన ఓ టిక్ టాక్ వీడియోలో మెడలో తాళిబొట్టుతో, నుదుటన కుంకుమతో కనిపించింది. శ్రీ రెడ్డి గతంలో కూడా తాను పెళ్లి చేసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్‌ హీరో నిఖిల్, ప్రముఖ దర్శకుడు దిల్ రాజు సైతం నిరాడంబరంగా .. పెళ్లిల్లు చేసుకున్నారు. అయితే తాజాగా వారి జాబితాలో శ్రీరెడ్డి కూడా చేరినట్లయ్యిందని నెటిజన్లు అంటున్నారు. అయితే తనకు పెళ్లి కాలేదని ఇదంతా టిక్ టాక్ కోసమే అంటూ శ్రీరెడ్డి క్యాప్షన్ పెట్టింది. కానీ శ్రీరెడ్డి గతంలో ఓ రాజకీయ నేతకు భార్యగా ఉండేందుకు ఇష్టపడతానని పబ్లిగ్గా యూట్యూబ్ వీడియోలో స్టేట్ మెంట్ ఇచ్చేసింది. అయినప్పటికీ శ్రీరెడ్డి సీక్రెట్ మ్యారేజ్ పై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటోందని, అక్కడే ఓ యువ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల పై శ్రీరెడ్డి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu