సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘నగ్నం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శ్రీ రాపాక. తొలి సినిమాలోనే బోల్డ్ సీన్లలో ఓ రెంజ్‌లో రెచ్చిపోయింది ఈ బ్యూటీ. ఇక ఈ భామ వరుసగా మీడియా ఛానల్స్ కు ఇంటర్యూలు ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది. బాలయ్య సింహం అయితే నేను పులి అనీ నేను విజయ్ దేవరకొండ అర్ధరాత్రి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్లేవాళ్లమని ఏవేవో చెప్పుకొచ్చింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు జీవితం నా వల్లే మారిపోయిందంటూ వ్యాఖ్యలు చేసింది. ఫ్యామిలీ హీరోగా దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్ డం కొనసాగించిన ఆయన కొన్నాళ్ల పాటు ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొన్నాడు. అనేక కారణాలతో సంపాదించుకున్నదంతా పోగొట్టుకున్నారు. అయితే ఆ సమయంలో ఆయనకు శ్రీ రాపాక మనోధైర్యాన్ని ఇచ్చిందంట. శ్రీరాపాక మాట్లాడుతూ ..
సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లానువ్వు లేని జీవితం’ సినిమాకు నేను కాస్ట్యూమ్స్ డిజైనర్ ఆసమయంలో జగపతి బాబుకు నాకు పరిచయం ఏర్పడింది. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాకి శ్రీహరి గారు చనిపోవడంతో ఆయన ప్లేస్‌లో జగపతిబాబు గారు వచ్చారు. సెట్ లో నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉండేదాన్ని.. నన్ను ఆయన తింగరి అనిపిలుస్తారు. ఏయ్.. తింగరి ఇటు రా.. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటావా? అనేవారు. గులాబీ హౌస్‌లో షూట్ జరిగేది. ఎక్కువ సీన్లు అక్కడే జరిగాయి. ఒక సమయంలో ఆయన డల్ గా ఉండటం చూసి ఏమైంది అని అడిగాను. అప్పుడు ఆయన తన కష్టాలను చెప్పుకున్నారు. నేను మీకు పరిచయం అయ్యాను కదా సార్ ఇక మీ జీవితం మారిపోతుంది అనేదాన్ని. నేను అన్నట్లుగానే ఆయన కొన్నాళ్లకే కోట్లు సంపాదించారు. అంటే మొత్తం నేనే చేశాను.. నావల్లే అని కాదు కాని.. పాజిటివ్ ఎంకరేజ్‌మెంట్ అని చెప్తున్నా..” అంటూ చెప్పుకొచ్చింది.