కలర్ ఫొటో ఫేం సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం శ్రీరంగనీతులు. యూవత భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము తెలుసుకునేలా.. చేసుకునే కథలతో, మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వుంటాయి. అలాంటిదే ఈ సినిమా.
ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ప్రారంభించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ టీజర్ ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి గారి ఆహ్లాదకరమైన పాత్ర చెప్పే మాటలతో ప్రారంభమైంది. సహాజమైన సంభాషణలతో, సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకునే విధంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా దర్శకుడ చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఈతరం యువత వారి ఆలోచనలను, వారి ఎమోషన్స్‌ను ఏ విధంగా వుంటున్నాయి అనేది ఈ చిత్రంలో వుండే పాత్రల ద్వారా చూపిస్తున్నాం.
సినిమాలో వుండే ఆసక్తికరమైన కథ, కథనాలను ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే మనసుకు హత్తుకుంటాయి. కొత్తదనంతో పాటు పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందించిన చిత్రమిది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలు.. ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్ని అంశాల కలయికతో దర్శకుడు చిత్రాన్ని అందర్ని అలరించే విధంగా తెరకెక్కించాడు. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అన్నారు.