HomeTelugu TrendingSreenu Vaitla: మహేష్ బాబు తో ఆ సినిమా చేయాల్సింది కాదు అంటున్న డైరెక్టర్

Sreenu Vaitla: మహేష్ బాబు తో ఆ సినిమా చేయాల్సింది కాదు అంటున్న డైరెక్టర్

Sreenu Vaitla regrets making this Mahesh Babu's movie
Sreenu Vaitla regrets making this Mahesh Babu’s movie

Sreenu Vaitla Viswam Movie promotions:

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల త‌న కొత్త చిత్రంతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌స్తున్నారు. గోపీచంద్ హీరోగా తెర‌కెక్కించిన ఈ చిత్రం పేరు విశ్వం, అక్టోబర్ 11న భారీగా విడుద‌ల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న శ్రీను వైట్ల భారీగా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు.

తాజా ఇంట‌ర్వ్యూలో శ్రీను వైట్ల మాట్లాడుతూ, ఆగడు సినిమా త‌న జీవితంలో అతిపెద్ద ఫెయిల్యూర్ అని అన్నారు. ఆగడు సినిమా కోసం ముందుగా పెద్ద బ‌డ్జెట్ కథను ప్లాన్ చేశారట. మహేష్ కూడా ఆ కథకు అప్రూవ‌ల్ ఇచ్చారట. అయితే, నిర్మాత‌లు వెనుక‌డుగుపెట్ట‌డంతో, త‌న‌కు న‌చ్చ‌ని స‌బ్జెక్ట్‌ను తీసుకుని వెళ్లాల్సివ‌చ్చిందని అన్నారు. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే, ఆగడు పెద్ద డిజాస్ట‌ర్ అయింది.

శ్రీను వైట్ల మాట్లాడుతూ, తాను ఏం జ‌రుగుతుందో తెలిసిన‌ప్ప‌టికీ.. ఆ సినిమాతో ముందుకు వెళ్లడం త‌న జీవితంలో చేసిన పెద్ద త‌ప్పు అని అన్నారు శ్రీను వైట్ల. ఆ సినిమా గురించి తాను జీవితాంతం ప‌శ్చాత్తాప‌ప‌డుతాన‌ని అన్నారు.

ఇక విశ్వం విషయానికి వస్తే, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విశ్వం ఓ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా. దీనికి సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు త్వరలో బయటకు రానున్నాయి.

Read More: RC16: రామ్ చరణ్ తో సినిమా కోసం రైటర్స్ కి ఇస్తున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu