HomeTelugu Big Storiesకోలీవుడ్ సినిమాకోసం Sreeleela పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

కోలీవుడ్ సినిమాకోసం Sreeleela పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Sreeleela's shocking remuneration in Kollywood!
Sreeleela’s shocking remuneration in Kollywood!

Sreeleela Remuneration:

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ Sreeleela ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ సరసన ‘ప్రశక్తి’ అనే చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెడుతోంది. అయితే ఈ సినిమా కోసం ఆమె తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఒకప్పటి కన్నా శ్రీలీల రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందని సమాచారం. తెలుగులో ఆమె ₹1.5 నుంచి ₹1.75 కోట్ల మధ్య పారితోషికం అందుకుంది. కానీ కోలీవుడ్ ఎంట్రీ కోసం ఈ మొత్తం గణనీయంగా పెరిగిందట. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, ఆమె క్రేజ్, గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్ వల్ల తమిళ సినీ ప్రాజెక్టులకు మంచి అడ్వాంటేజ్ ఉందని చెప్పుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)

తెలుగులోనే కాకుండా, బాలీవుడ్‌లో కూడా శ్రీలీల తన మార్క్ వేసేందుకు రెడీ అవుతోంది. ‘ఆశికీ 3’ అనే రొమాంటిక్ డ్రామాతో హిందీ పరిశ్రమలో అడుగుపెడుతోంది. ఈ సినిమాకి ఆమె ఏకంగా ₹2 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటుందని సమాచారం. సౌత్ హీరోయిన్‌లకు బాలీవుడ్‌లో తక్కువ పారితోషికం ఇస్తారనే టాక్ ఉన్నప్పటికీ, శ్రీలీల తన మార్కెట్‌ని బలంగా పెంచుకుంటోంది.

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్—మూడు ఇండస్ట్రీలలోనూ శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఆమె ఎనర్జీటిక్ డ్యాన్స్, గ్లామర్, గర్ల్-నెక్స్ట్-డోర్ అప్పీల్ చూసి అనేక మంది యంగ్ హీరోలు ఆమెతో కలిసి నటించాలనుకుంటున్నారట. తమిళంలో యువ హీరోలు ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాల‌ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని టాక్.

ఈ జోరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో శ్రీలీల మరింత స్టార్డమ్ సాధించడం ఖాయం. బాలీవుడ్, కోలీవుడ్‌లో ఈమె టాలెంట్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి!

ALSO READ: Prabhas పేరుతో ఒక ఊరు ఉందన్న విషయం మీకు తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu