HomeTelugu TrendingSreeleela: స్టార్ హీరో కొడుకుతో బాలీవుడ్ ఎంట్రీ!

Sreeleela: స్టార్ హీరో కొడుకుతో బాలీవుడ్ ఎంట్రీ!

Sreeleela Sreeleela

Sreeleela: తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీలీల.. ఇప్పుడు బాలీవుడ్ లోకి సైతం అడుగుపెట్టనుంది. శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన పెళ్లి సందడి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీ లీల. ఆ తరువాత ధమాకా చిత్రం నుంచి ఆమె దశ తిరిగిపోయింది. వరసగా 9 సినిమా ఛాన్సులు అందుకొని స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది.

అయితే వాటిల్లో రెండు, మూడు సినిమాలు మినహా అన్ని డిజాస్టర్స్ గా మిగలడం గమనర్హం. ముఖ్యంగా ఆదికేశవ సినిమా శ్రీ లీల స్టోరీ సెలక్షన్ పై ఎన్నో విమర్శలు తీసుకొచ్చింది. ఈ క్రమంలో శ్రీ లీల తన తదుపరి సినిమా కథలను ఆచితూచి ఎన్నుకొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.Ibrahim Ali Khan to romance Sreeleela, details inside

కాగా ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాది భగత్ సింగ్ సినిమా మాత్రమే ఉంది. మరోపక్క రవితేజ రాబోయే చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి కానీ.. అధికారికంగా మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో ఇప్పటికీ హీరోయిన్ స్టార్ హీరో కొడుకుతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్త వైరల్ అవుతుంది.

సీనియర్ హీరో, దేవరతో తెలుగులో విలన్ గా పరిచయం కాబోతున్న సైఫ్ అలీ ఖాన్.. కొడుకుతో  శ్రీ లీలా తన బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనందట. ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ సినిమాకి.. తననే ఎంచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం జన్నత్ ఫేమ్ కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో రూపొందుతుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం ఆగస్టు నెల నుంచి ప్రారంభం కానుందని వినికిడి. ఇక వచ్చేవారం ఇదే విషయంపై సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటన కూడా ఇవ్వనందట.

మొత్తానికి ఇక్కడ తెలుగులో శ్రీకాంత్ కొడుకు తో ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల.. అక్కడ సైఫ్ ఆలీ ఖాన్ కొడుకుతో ఎంట్రీ ఇవ్వనుంది. మరి శ్రీ లీల బాలీవుడ్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu