అతిలోక సుందరి శ్రీదేవి మరణించి ఫిబ్రవరి 24 వ తేదీకి సంవత్సరం అవుతుంది. శ్రీదేవి తొలి వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు బోనికపూర్ కుటుండం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆరోజున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
శ్రీదేవికి ఎంతో ఇష్టమైన కోటా చీరను ఆన్ లైన్‌లో వేలానికి పెట్టారు. ఈ ఊదా రంగులో ఉండే ఈ చీర ప్రారంభ ధర రూ.40 వేలుగా ఉంచారు. కాగా, ఇప్పుడు ధర రూ.90 వేల వరకు వెళ్ళింది. ఫిబ్రవరి 24 వరకు ఈ ధర మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ చీర కోసం ఎవరైనా బిడ్డింగ్ వెయ్యొచ్చు. ధరను కోట్ చేస్తూ బిడ్డింగ్ చేయాలి. చివరి వరకు ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వాళ్లకు ఆ చీర దక్కుతుంది. వేలంలో వచ్చిన డబ్బును చారిటి సంస్థకు విరాళంగా ఇస్తారట.