శ్రీదేవి మరణించి దగ్గర దగ్గర సంవత్సరం కావొస్తున్నది. ఎదో ఒక సందర్భంలో ఇండియన్ సినిమా అభిమానులు శ్రీదేవిని స్మరించుకుంటూనే ఉంటారు. ఆమె సడెన్ గా మరణించడం తీరనిలోటే అని చెప్పాలి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేసిన మొదటి సినిమాను చూడకుండానే కన్నుమూసింది శ్రీదేవి.
షారుక్ ఖాన్ జీరో సినిమాలో శ్రీదేవి కనిపించబోతున్నట్టు సమాచారం. ఇందులో ఓ పార్టీ సాంగ్ ఉందట. ఈ సాంగ్ లో బాలీవుడ్ నటీమణులు చాలామంది నటించారు. అందులో అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఉందని తెలుస్తున్నది. శ్రీదేవి మరణించక ముందు ఈ సాంగ్ షూట్ చేశారట. కొన్ని సెకన్లపాటు శ్రీదేవి సాంగ్ లో సందడి చేసిందట. శ్రీదేవి నటించిన ఆఖరి సినిమా కావడంతో జీరోలో ఆమెను చూసుకోవడానికైనా ఆమె అభిమానులు థియేటర్ కి వస్తారు