డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో టాలీవుడ్ యంగ్ శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘గాలి సంపత్’ సినిమా ప్రారంభమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘పటాస్’ నుండి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకూ అన్ని చిత్రాలకు కో-డైరెక్టర్, రైటర్‌గా వర్క్ చేసిన ఆయన మిత్రుడు ఎస్. క్రిష్ణ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో లవ్‌లీసింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌రాజు క్లాప్‌నివ్వగా, నారా రోహిత్ కెమెరా స్విఛాన్ చేశారు. వరుణ్‌తేజ్ గౌరవ దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘తండ్రీకొడుకుల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా ఇది. ఎన్నో గొప్ప పాత్రలు పోషించిన రాజేంద్రప్రసాద్ కెరీర్‌లో ‘గాలి సంపత్’ పాత్ర మరో మైలురాయిలా నిలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఈ సినిమాలో తనికెళ్ల భరణి,రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూప లక్ష్మి తదితరులు నటించనున్నారు.