‘స్పై’ మూవీ హీరోయిన్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ మంచి జాక్ పాట్ కొట్టేసింది. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం సిద్దార్థ్ నటించిన ‘లవ్ ఫేయిల్యూర్’ సినిమాలో శివానీ అనే ఓ కీలక పాత్రలో నటించింది ఈ బ్యూటీ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ తమిళ, కన్నడ సినిమాలు చేసింది. మళ్లీ పదేళ్ల తర్వాత స్పై సినిమాతో టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చింది. రెండు రోజుల క్రితం విడుదలైన స్పై సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కానీ కలెక్షన్లు మాత్రం ఓ రెంజ్లో ఉన్నాయి.
ఈ సినిమాలో నిఖిల్ నటన గురించి ఎంతలా మాట్లాడుకుంటున్నారో.. ఐశ్వర్య మీనన్ నటన గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. ఏదో సినిమా అన్నాక హీరోయిన్ రోల్ ఉండాలి కాదా అనే విధంగా కాకుండా స్పై సినిమాలో ఐశ్వర్య పాత్రకు మంచి హైప్ ఉంది. దాన్ని ఐశ్వర్య కూడా పర్ఫెక్ట్గా యుటిలైజ్ చేసుకుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఐశ్వర్య అదరగొట్టిందను పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి ఏకంగా పవన్ సినిమాలో నటించే చాన్స్ పట్టేసినట్లు తెలుస్తుంది.
పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఓజీ’ మూవీలో ఓ కీలకపాత్ర కోసం చిత్రయూనిట్ ఐశ్వర్యను సంప్రదించగా.. ఆమె వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకుందట. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ లైనప్‌లో ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పవన్ సైతం ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచనలో ఉన్నాడట.