HomeTelugu Trendingహీరో విశాల్‌,అనీశా పెళ్లి ఆగిపోయిందా?

హీరో విశాల్‌,అనీశా పెళ్లి ఆగిపోయిందా?

3 20హీరో విశాల్‌ ఈ ఏడాది మార్చి 10న విశాల్‌కు హైదరాబాద్‌కు చెందిన అనీశా అనే అమ్మాయితో నిశ్చితార్థమైంది. అప్పటి నుంచి వీరికి సంబంధించిన ఫొటోలను అనీశా సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తుండేది. కానీ ఇటీవల ఈ వీరి ఫొటోలన్నింటినీ ఆమె డిలీట్‌ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ జంట మధ్య మనస్పర్థలు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే వీరి బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చిలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నాక టర్కీకి కూడా వెళ్లొచ్చారు. విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం టర్కీలోనే షూటింగ్‌ జరిగింది. అనీశాను కూడా విశాల్‌ అక్కడికి తీసుకెళ్లారు. ఇప్పుడు వీరి నిశ్చితార్థం గురించి వస్తున్న వార్తల గురించి అటు విశాల్ గానీ, ఇటు అనీశాగానీ స్పందించలేదు.

అనీశా ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌ రెడ్డి’ వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించారు. ‘అయోగ్య’ (‘టెంపర్‌’ తమిళ రీమేక్‌) సినిమా చిత్రీకరణ వైజాగ్‌లో జరుగుతున్న సమయంలో అనీశాతో తనకు పరిచయం ఏర్పడిందని విశాల్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత అది ప్రేమగా మారిందని, ఆ దేవుడు తన కోసం అనీశాను పంపారని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu