India’s Biggest Flop Movie:
బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ కపూర్ నటించిన ‘ది లేడీ కిల్లర్’ సినిమా. ఈ సినిమా మాత్రం చరిత్రలోనే భారీ నష్టాన్ని మిగిల్చింది. ది లేడీ కిల్లర్ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో ఉంటుంది. సాధారణంగా ఈ జానర్ సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. కానీ ఈ సినిమా మాత్రం విఫలమైంది.
తాజా సమాచారం ప్రకారం, సినిమా మొదటి రోజు కేవలం 293 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ కేవలం రూ. 38,000 మాత్రమే వచ్చాయి. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత దారుణమైన ఓపెనింగ్‌లలో ఒకటి.
ఈ సినిమాను అజయ్ బహల్ దర్శకత్వం వహించగా, అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే సినిమా పూర్తిగా సిద్ధం కాకుండానే థియేటర్స్‌లో విడుదల చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లు పూర్తిగా షూట్ కాకుండా, ఒక అంతంత మాత్రమైన సినిమా ప్రేక్షకులకు అందించారు. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాను పూర్తిగా తిరస్కరించారు.
ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే, సినిమా ఓటీటీలో రిలీజ్ కావాలని ముందే కాంట్రాక్ట్ చేసుకున్నారు. కానీ, డిసెంబర్‌లో ఓటీటీలో విడుదల చేసేందుకు కనీసం ఆరు వారాల ముందు థియేటర్లలో రిలీజ్ చేయాల్సి ఉంది. ఈ డెడ్‌లైన్ నాటికి సినిమా కంప్లీట్ కాలేదు. అయినప్పటికీ, ఓటీటీ కాంట్రాక్ట్ కోసం సినిమా థియేటర్లలో విడుదల చేసేశారు. కానీ, ఆ తర్వాత కూడా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ సినిమాను కొనడానికి ముందుకు రాలేదు. చివరికి సినిమా యూట్యూబ్ ఉచితంగా అందుబాటులో ఉంది.