మెగా పవర్ స్టార్ రామ్చరణ్- ఉపాసన జంట గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రామ్చరణ్ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతుంటే.. ఉపాసన సేవా పరంగా మంచి మనస్సు చాటుకుంటుంది. మరో పక్క అపోలో ఆసుపత్రి భాద్యతలను చూసుకుంటుంది.
ఇక ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. రామ్ చరణ్, తన ఫ్యామిలీకి సంబంధించిన అన్నీ అప్డేట్స్ని నెటిజన్లతో పంచుకుంటుంది. గత ఏడాది ఉపాసన-రామ్చరణ్ తల్లితండ్రులైన సంగతి తెలిసిందే. పెళ్లైన పదేళ్ల తరువాత వీరి ఓ పాపకు జన్మనిచ్చారు. దీంతో ఈ జంటతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి మనుమరాలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు క్లింకారపై రూపొందించిన పాట వైరల్ గా మారింది. సంక్రాంతి పండుగ సందర్భంగా రాంచరణ్ భార్య ఉపాసన చేతుల మీదుగా ఈ పాట యూట్యూబ్ లో విడుదలైంది. చిరు కుటుంబంపై అభిమానంతో రచయిత, నిర్మాత, దర్శకుడు బెల్లంకొండ శ్రీధర్ (రఘు) దీనిని నిర్మించారు.
కిలకిల నవ్వింది క్లింకారా.. అంటూ సాగే ఈ పాట శ్రీమతి ఉపాసనకు, మెగా ఫ్యామిలీ అభిమానులకు నచ్చడం తమ అదృష్టమని శ్రీధర్ తెలిపారు. యూట్యూబ్ లో పాట విడుదల సందర్భంగా ఆయన ఈమేరకు సోమవారం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. క్లింకార రాక మెగాస్టార్ ఇంటిని సంతోషాల పొదరిల్లుగా మార్చిందని, అభిమానులకు కనులపండుగలా చేసిందని నిర్మాత శ్రీధర్ చెప్పారు.
ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంతా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో ఉన్నారు. బెంగళూరు ఫార్మ్ హౌస్ లో ఈ పండగ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కి మెగా, అల్లు హీరోలు హాజరయ్యి సందడి చేస్తున్నారు. నేడు అక్కడి నుంచి ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఫొటోని కూడా అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలో పవన్ కళ్యాణ్ మాత్రమే మిస్ అయ్యారు. అయితే పవన్ కి బదులుగా ఆయన వారసులు అకిరా నందన్, ఆద్య పాల్గొన్నారు.
A song composed for #KlinKaara
Press note:
మమతానురాగాల మెగా ఫ్యామిలీ..
మెగాస్టార్ మురిపెం..
మెగా పవర్ స్టార్ గారం..
మెగా ఇంట ఆ యువరాణి.. ముద్దులొలికే క్లిం కారా..మెగాస్టార్ ఇంట.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల గారాలపట్టి రాకతో ఆ కుటుంబం సంతోషాల పొదరిల్లు అయితే..… pic.twitter.com/tw1oxBjcRy
— idlebrain.com (@idlebraindotcom) January 15, 2024