పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 25) ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఆంధ్రలో స్పెషల్ షోస్ కు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. అంతేకాదు ‘టిక్కెట్ రేట్లు అధికంగా అమ్మితే ఊరుకునేది లేదని కూడా థియేటర్లకు హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు. ఇదిలా ఉంటే నైజాంలో ఈ సినిమాను పంపిణీ చేస్తున్న ‘దిల్’ రాజు ప్రభుత్వం నుండి రోజుకు ఐదు ఆటలు చొప్పున రెండు వారాల పాటు ‘భీమ్లా నాయక్’ను ప్రదర్శించడానికి అనుమతి తెచ్చుకున్నారు.
అలానే పెద్ద సినిమాలకు ఎక్కువ రేట్లకు టిక్కెట్ అమ్ముకోవచ్చునంటూ ప్రభుత్వం కొద్ది వారాల క్రితం జీవో జారీ చేసింది. ఆ రకంగా నైజాంలో ‘భీమ్లా నాయక్’ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు. మరి ఇంకో రోజు సమయం ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం మీద కూడా అక్కడి పంపిణీదారులు ఒత్తిడి తెచ్చి, టిక్కెట్ రేట్ల పెంపు, ఐదు ఆటల విషయంలో అనుమతి పొందుతారేమో చూడాలి.