ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ దేవుడి ఆశీర్వాదంతో వచ్చే సోమవారం ఓ శుభవార్త వింటామని వెల్లడించారు. ఈ మేరకు చరణ్ గురువారం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వరుసగా నాలుగో రోజు తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన నిదానంగా కోలుకుంటున్నారని పేర్కొన్నారు. దేవుడి ఆశీర్వాదం తో వచ్చే సోమవారం ఒక శుభవార్త వింటామని అన్నారు. చరణ్ ట్వీట్ తో బాలు త్వరలోనే కోలుకుంటాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్సను అందజేస్తున్నారు.