గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి మరో అరుదైన గౌరవం దక్కింది. కోవిడ్-19 కారణంగా (సెప్టెంబర్ 25, 2020)న ఆయన ఈ లోకాన్ని వీడిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ప్రతీక్షణం ఆయన్ను తలచుకోని అభిమాని లేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా పుదుచ్చేరిలోని ఒక బేకరి సంస్థ బాలుకి విభిన్నంగా నివాళులర్పిస్తోంది. చాక్లెట్‌తో ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటుచేసే సాంప్రదాయాన్ని పాటిస్తున సంస్థ తాజాగా ఎస్పీబీకి నివాళిగా ఏకంగా 339 కిలోలతో 5 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న చాక్లెట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
పుదుచ్చేరిలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏటా పలు రంగాలలో గొప్ప పేరు గాంచిన ప్రముఖులను స్మరించుకోవడం ఏర్పాటు చేయడం జునిక బేకరీకి అలవాటు. ఈ క్రమంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రాహాన్ని కూడా పూర్తిగా చాక్లెట్‌తో మాత్రమే రూపొందించి ప్రదర్శనకు ఉంచింది. ఇది జనవరి 3వరకు ప్రదర్శనలో ఉంటుందని చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేసిన చెఫ్ రాజేంద్రన్ చెప్పారు. ఈ విగ్రహాం చేయడానికి 161 గంటలు పట్టిందని తెలిపారు.