HomeTelugu Trendingఎస్పీ బాలు ఆరోగ్యంపై కుమారుడు స్పందన

ఎస్పీ బాలు ఆరోగ్యంపై కుమారుడు స్పందన

SP Charan on his father sp

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతూ ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు. నిన్న శుక్రవారం ఆయన ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉండటంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు తనయుడు చరణ్‌ తన తండ్రి అభిమానులు, శ్రేయోభిలాషులకు ఓ ఆడియో విడుదల చేసాడు.

అందులో మాట్లాడుతూ..”అందరికీ నమస్కారం. నాన్నగారి ఆరోగ్యం విషయంలో తాజా పరిస్థితి గురించి తెలుసుకునేందుకు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకే అప్‌డేట్‌ ఇవ్వాలని అనుకున్నా. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. నిన్న వెంటిలేటర్‌పై ఉంచడం ఆయనకు ఎంతో ఉపయోగపడింది. నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంపై వైద్యులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆయన ఈ పరిస్థితి నుంచి బయటపడి సాధారణ స్థితికి వచ్చేస్తారు. నాన్నగారి ఆరోగ్యంపై నేను అప్‌డేట్‌ ఇస్తాను. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు” అని ఆడియో సందేశంలో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu