HomeTelugu TrendingSouth remakes in Bollywood: బాలీవుడ్ కి సౌత్ సినిమాలు అచ్చి రావడం లేదా

South remakes in Bollywood: బాలీవుడ్ కి సౌత్ సినిమాలు అచ్చి రావడం లేదా

South remakes in Bollywood failing badly
South remakes in Bollywood failing badly

South remakes in Bollywood:

కేజీఎఫ్, క‌ల్కి 2898 AD, పుష్ప వంటి సౌత్ సినిమాలు భారీ బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నుండి మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదల అవుతున్నాయి. భాష పరిధి లేకుండా నార్త్ లో కూడా మంచి విజయాలు అందుకుంటున్నాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఈమధ్య కాలంలో పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు రావడం లేదు.

షారుఖ్ ఖాన్ ప‌ఠాన్‌తో ఒక పెద్ద హిట్ అయితే దొరికింది కానీ ఆ తరువాత బాలీవుడ్ మళ్లీ డల్ అయిపోయింది. దీంతో అక్కడి దర్శక నిర్మాతలు రీమేక్ సినిమాల మీద పడ్డారు. సౌత్ లో బాగా హిట్ అయిన సినిమాలను హిందీ లో తీయడం మొదలు పెట్టారు. కానీ అవి కూడా ఫ్లాప్ అవుతున్నాయి.

కరోనా తర్వాత 20 కి పైగా రీమేక్‌లు హిందీలో విడుదలయ్యాయి. అందులో 90 శాతం ప్లాప్‌లు అవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. ఈ కాలంలో విడుదలైన సినిమాలు బచ్చన్ పాండే, బాడ్ బాయ్, ఛత్రపతి, దృశ్యం 2, ఫర్రే, గుమ్రా, హిట్, జెర్సీ, కిసీ కా భాయి కిసీ కి జాన్, లాల్ సింగ్ చద్దా, మిల్లి, నికమ్మ, సెల్ఫీ, శైతాన్, షెహ్జాదా, తడాప్, థ్యాంక్ గాడ్, విక్ర‌మ్ వేద‌హ.

అన్నీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రేంజ్ లో చతికిలబడ్దాయి. పోనీ ఇప్పటికైనా సినిమాలు మారుస్తున్నారా అంటే ఇంకా చాలానే రీమేక్ సినిమాలు నిర్మాణంలో అన్నాయి. ఇంకా కొన్ని విడుదలకు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కనీసం రెండు సినిమాలు విడుదల చేసే బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఇప్పుడు రీమేక్ సినిమాలతో ఫ్లాప్ లే అందుకుంటున్నారు. ఇప్పటికీ కూడా అక్షయ్ మరో రీమేక్‌తో ముందుకు వచ్చారు. అది స‌ర్ఫిరా.

అక్షయ్ కుమార్ స‌ర్ఫిరా తమిళ్ లో సూపర్ హిట్ అయిన సూరరై పోట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) సినిమా అధికారిక రీమేక్. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా అది. ఈ సినిమా హైదరాబాద్లో మొదటి రోజున కేవలం 100 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.

బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ మాత్రం ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్‌ తో రాకుండా వేరే భాష లో హిట్ సినిమాల రీమేక్‌లపై ఆధారపడటం ప్రేక్షకులకు కూడా చిరాకు తెప్పిస్తుంది. డైరెక్టర్స్ కూడా కొత్త కథలు, క్రియేటివ్ కథలతో రావాలని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu