స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్‌హాసన్ కాంబినేషన్‌లో ఇరవై రెండేళ్ల ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండో భాగం చిత్రీకరణ ఈ నెల 18 నుంచి మొదలుకానుంది. లైకా సంస్థ భారీ బడ్జెట్‌తో దీనిని తెరకెక్కిస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా ఇందులో కొరియాకు చెందిన ప్రముఖ నటి బేయ్ సుజీ కూడా కీలక పాత్రలో నటించనున్నారట.
చెన్నై, పొల్లాచి, ఉక్రెయిన్, తైవాన్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నారట. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కానున్నాయి. ఇటీవల అమెరికా నుంచి మేకప్ నిపుణులు చెన్నై చేరుకున్నారు. ఇందులో కమల్‌హాసన్‌కు యువకుడు, వృద్ధుడిలా కనిపించేలా మేకప్ వేసి లుక్ టెస్టులు చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. సాధారణంగా శంకర్ సినిమాలంటేనే చిత్రీకరణకు ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఈ సినిమాను మాత్రం నాలుగు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు శంకర్. మేలో సినిమాను విడుదల చేయాలనే దృఢసంకల్పంతో శంకర్ ఉన్నట్లు సమాచారం.