Sookshmadarshini OTT release date:
మలయాళంలో మిస్టరీ థ్రిల్లర్ “సూక్ష్మదర్శిని” సినిమాతో నజ్రియా నాలుగేళ్ల తర్వాత మళ్లీ మాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, రూ.50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎమ్‌సి జితిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నజ్రియా సరసన బాసిల్ జోసెఫ్ కీలక పాత్ర పోషించారు.
సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రత్యేకించి కేరళలో కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఈ సినిమా చాలా బాగా ఆడింది. ఇప్పుడు ఈ థ్రిల్లర్‌ను ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్ వచ్చింది! “సూక్ష్మదర్శిని” జనవరి 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కి రానుంది.
#Sookshmadarshini will premiere on Disney+ Hotstar, Tonight at 12AM.
In Malayalam, Tamil, Telugu, Hindi, Kannada. pic.twitter.com/mRKYuRooq1
— OTT Gate (@OTTGate) January 10, 2025
ఈ సినిమా తెలుగు, తమిళం సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థ్రిల్లర్ జానర్‌కి ప్రత్యేకంగా ఇష్టపడే వారికి “సూక్ష్మదర్శిని” ఓ మంచి ఎంటర్టైనింగ్ సినిమా.
ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను ఏవి అనూప్, షైజు ఖలీద్, సమీర్ తాహిర్ కలిసి తీసుకున్నారు. అలాగే దీపక్ పరంబోల్, సిద్ధార్థ్ భరతన్, మెరిన్ ఫిలిప్, అఖిల భర్గవన్, పూజా మోహన్‌రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
సినిమా కథ, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్ని కూడా ఈ సినిమాను సూపర్‌హిట్‌గా నిలబెట్టాయి. అయితే ఇప్పుడిక సినిమా ఓటీటీలో విడుదలవుతున్న కాబట్టి మరింత పెద్ద ఎత్తున ప్రేక్షకులు చూస్తారని నిర్ధారించవచ్చు. ఇంతకుముందు మీరు మిస్ అయితే, జనవరి 11 తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ థ్రిల్లర్‌ను చూసి ఎంజాయ్ చేయచ్చు!
ALSO READ: Game Changer తో శంకర్ గేమ్ ఈసారైనా మారిందా?