‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమాలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ‘సదాశివ్’ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే తన పాత్ర నిడివిని కట్ చేయడం వల్ల సోనూ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. 45 రోజులు షూటింగ్లో పాల్గొన్న తర్వాత వైదొలిగారు. తాజాగా సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన వీడియో లీక్ అయ్యింది. అందులో సోనూ పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించారు. కుస్తీలో మరోవ్యక్తిని ఓ పట్టుపడుతూ ఉన్న ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సన్నివేశాన్ని తొలగించమని కంగన అడిగినందుకే సోనూ తప్పుకున్నట్లు సమాచారం. ఆయన వైదొలిగిన తర్వాత ఆ పాత్రలో మహ్మద్ జీషన్ అయుద్ నటించారు.
‘మణికర్ణిక’ సినిమాలో కంగన ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రను పోషించారు. క్రిష్ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే చిత్రంలో మార్పులు చేయాలని, సోనూ పాత్రను విరామం తర్వాత చంపేయాలని కంగన వాదించడంతో గొడవ జరిగింది. చరిత్రను వక్రీకరించడం ఇష్టంలేని క్రిష్ రీషూట్‌కు ఒప్పుకోలేదు. ఆయన దర్శకత్వం వహించకపోతే నటించనంటూ సోనూ వైదొలిగారు. తర్వాత ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు కంగన దర్శకత్వం వహించారు. కంగన మొత్తం స్క్రిప్టులో మార్పులు చేసే అధికారం తీసుకోవడం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది