బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈరోజు (శుక్రవారం) కలుసుకున్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ‘దేశ్ కే మెంటర్స్’ ( Desh Ke Mentors )ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఆ కార్యక్రమాన్ని త్వరలో ఆవిష్కరించనున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఢిల్లీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు సోనూ సూద్ వ్యవహరించనున్నట్లు ఆయన వెల్లడించారు. లక్షలాది మంది విద్యర్థులకు మార్గదర్శకత్వం వహించే అవకాశం తనకు ఈరోజు లభించిందని, విద్యార్థులకు నిర్దేశం చేయడం కంటే గొప్ప సేవ ఇంకేమీ ఉండదని సోనూసూద్ అన్నారు. ముఖ్యమంత్రితో కలిసి ఈ పథకం లక్ష్యాన్ని నెరవేరుస్తామని చెప్పారు. లాక్ డౌన్ ప్రారంభమైనప్పుడు, అనేక మందితోతో తాను మమేకమయ్యానని, విద్య అనేది ప్రధాన అంశం అనే విషయం తాను గ్రహించామని తెలిపారు. విద్యార్థులకు భవిష్యత్తుల్లో ఏమి చేయాలో అవగాహన ఉండనప్పుడు, కుటుంబంలో ఎవరూ చెప్పేగలిగే పరిస్థితిలో లేనప్పుడు వారి పరిస్థితి ఏమిటి? అలాంటప్పుడు ఎవరో ఒకరు విద్యార్థులకు మార్గదర్శకం కావాలి. ‘దేశ్ కే మెంటర్స్’ ప్రోగ్రాం ఇందుకు ఉద్దేశించినదే…అని సోనూసూద్ తెలిపారు. సోనూ సూద్‌ను దేశ్ కే మెంటర్స్ ప్రోగ్రామ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
మంచి పనులు చేయాలంటే మీరు రాజకీయాల్లోకి రావాలని చాలామంది అంటుంటారు. మంచి పనులు చేయడానికి రాజకీయాలే అవసరం లేదు. నాకు అలాంటి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు” అని సోనూసూద్ సమాధానమిచ్చారు.