కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డ వలస కూలీలకు సినీనటుడు సోనూసూద్ సాయం చేసి వారి పాలిట దేవుడిగా మారాడు. దీంతో ఆయనను రియల్ హీరో, దేవుడు అంటూ చాలా మంది కొనియాడుతున్నారు. ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. లాక్డౌన్ తర్వాత కూడా పలువురికి సాయపడి ఆయన అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కొందరు గుళ్లు కట్టి దేవుడిగా పూజిస్తూ హారతులు ఇస్తున్నారు. దీనిపై విష్ణు కుమార్ గుప్తా అనే నెటిజన్ ట్వీట్ చేస్తూ పలు ఫొటోలు పోస్ట్ చేశాడు.
ఆయన చేసిన ట్వీట్ కు సోనూసూద్ స్పందించారు. గుళ్లు కట్టి పూజలు చేయడానికి తాను అర్హుడిని కాదంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోనూసూద్ పలు సినిమాల్లో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ లో పాల్గొన్న ఆయనను చూసేందుకు తాజాగా ప్రజలు భారీగా తరలి వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు దేశంలోని ప్రముఖులు తమ ప్రాంతాల్లో సత్కారాలు కూడా చేస్తున్నారు.
कर्म ही पूजा है.🙏 pic.twitter.com/QXgSlIC0mz
— Vikash Kumar Gupta (@Vikash159980) November 30, 2020