నటుడు సోనూ సూద్ కరోనా సమయంలో ప్రజలకు ఎంతో సహాయపడ్డారు. వలస కార్మికులు పాలిట దేవుడిలా మారాడు. సూపర్ హీరో అంటు సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిసింది. అయితే ఇప్పుడు సోనూ సూద్ మాత్రం ‘నేను రక్షకుడిని కాను’ అంటున్నారు. లాక్డౌన్లో తన అనుభవాలను ప్రంపచానికి చెప్పేందుకు ఒక పుస్తకం రాస్తానని సోనూ ఇప్పటికే ప్రకటించాడు. తాజాగా మీనా అయ్యర్ అనే జర్నలిస్టుతో కలిసి ఆ పుస్తకాన్ని పూర్తి చేశాడు. ‘ఐయామ్ నో మెస్సయ్య’ అనే పేరుతో ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సహకరించిన జర్నలిస్టు మీనా అయ్యర్, ‘పెంగ్విన్ ఇండియా’కు సోనూసూద్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ పుస్తకం డిసెంబర్లో విడుదల కానుంది. ‘ఇది నా జీవిత కథ. కేవలం నాది మాత్రమే కాదు. ఎన్నో వేలమంది వలస కార్మికుల కథ’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు.