కరోనా కష్టకాలంలో సెలబ్రిటీలు ప్రజలకు అండగా నిలుస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కొంతమంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు విడుదల చేయగా మరి కొందరు స్వయంగా అన్నదానం, నిత్యావసరాలను దానం చేస్తున్నారు. ఇక నటుడు సోను సూద్ ముందు నుండి వలస కార్మికుల పట్ల ఉదారత చూపిస్తున్నాడు. ఇదివరకు కేసీఆర్ వలస కార్మికులను ఆదుకుంటాం అని చెప్పగా రియల్ లీడర్ అంటూ సీఎం ను ప్రశంసించాడు. ఇప్పుడు తాజాగా ఉపాధిలేక ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికుల్ని స్వస్థలాలకు తరలించడం కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. దీనికోసం ఆయన స్వయంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని రవాణా సౌకర్యం కల్పించారు. సోమవారం ఈ బస్సులు థానే, (మహారాష్ట్ర), గుల్బర్గా (కర్ణాటక) నుంచి బయలుదేరాయి. సోనూసూద్ వారికి గుడ్ బై చెబుతూ తన ఉదారతను చాటుకున్నాడు. సోను సూద్ చేసిన సాయాన్ని చుసిన వారు మిగతా సెలబ్రిటీలు కూడా ఇలాంటి కష్ట కాలంలో గ్లామర్ పెంచడం ఆపేసి ప్రజలకు సాయం చేస్తే బాగుండేదని అనుకుంటున్నారు.
Well Done! @Sonu_Sood becomes the first B-town celeb to organise multiple transport buses for hundreds of migrants stuck in Mumbai amid #coronavirus and nationwide #lockdown #SonuSood #migrantworkers #indiafightscorona pic.twitter.com/5N69sanuvc
— Atul Mohan (@atulmohanhere) May 11, 2020