కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. కరోనా కాలంలో ముఖ్యంగా వలస కార్మికుల కష్టాలు దేశమంతటా పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. ఇలాంటి సంక్షోభం సమయంలో వలస కార్మికులను ఆదుకుని నటుడు సోనూసూద్ దేవుడిగా వెలుగొందుతున్నాడు. వలస కార్మికుల కష్టాలకు చలించిపోయిన సోనూ సూద్ తన సొంత ఖర్చుతో వారిని స్వస్థలాలకు చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర పోలీసులకు 25 వేల ఫేస్ షీల్డ్‌లను ఆయన దానం చేశారు. సోనూసూద్ చేసిన సేవలను ప్రజలే కాదు ప్రభుత్వాలు సైతం మెచ్చుకున్నాయి. అయితే సోనూసూద్ జీవితం పై ఓ సినిమా తీయాలని పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలు చూస్తున్నారట . ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ స్పందిస్తూ నా బయోపిక్ తీస్తే హీరోగా నేనే చేస్తాను అన్నారు . ఎందుకంటే ఆయన జీవితంలో ఎదురైన బాధలు, కష్టాలు తనకన్నా ఎక్కువగా
ఎవరికీ తెలియదు కాబట్టి తానే హీరోగా చేస్తానని అంటున్నాడు.