బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు సుశాంత్ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గత ఆరు నెలలుగా ఆయన డిప్రెషన్ లో ఉన్నారని.. ఆ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. పేరు మోసిన కొందరి వలన చిన్నా చితకా నటీనటులకి ఆఫర్స్ కరువయ్యాయని నెటిజన్లు మండిపడుతున్నారు. కొందరు నటులు కూడా నెపోటిజం పై స్పందించారు. తాజాగా బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ సంగీత పరిశ్రమలో మరిన్ని ఆత్మహత్యలు చూస్తామని సంచలన కామెంట్స్ చేశాడు. కేవలం రెండు కంపెనీలు మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తున్నాయని.. సినీ రంగం కంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో పెద్ద మాఫియాలు ఉన్నాయంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కొత్త సింగర్స్, లిరిక్స్ రైటర్స్ మరియు కంపోజర్ యొక్క కళ్ళలో, మాటలలో నేను నిరాశను చూశాను. అంటూ సోనూ నిగమ్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారయి.