డైరెక్టర్ మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో వస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్‌లో వైఎస్సార్ (తండ్రి)పాత్రలో మమ్ముట్టి నటిస్తుండగా.. వైఎస్ జగన్ (కొడుకు పాత్ర)గా కోలీవుడ్ యాక్టర్ జీవా లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించాడు డైరెక్టర్. వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణంలో అప్పటి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ కూడా ఉంటుందని తెలిసిందే.
ఈ సినిమాలో కథానుగుణంగా సోనియాగాంధీ పాత్ర ఉండనుండగా.. ఈ పాత్రలో కనిపించబోయే నటి ఎవరో క్లారిటీ ఇచ్చాడు. సోనియాగాంధీ రోల్‌లో జర్మనీ నటి సుజానే బెర్‌నెర్ట్ నటిస్తోంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశాడు. సోనియాగాంధీకి కాపీలా ఉన్న సుజానే లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
జర్మనీలో జన్మించిన సుజానే కమర్షియల్ యాడ్స్, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పలు టీవీ సీరియల్స్‌లో నటించింది. మరి సుజానే బెర్‌నెర్ట్ యాత్ర 2లో ఎలాంటి పర్‌ఫార్మెన్స్ ఇవ్వబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. ఈ సినిమాలో ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉండనుంది. ఈ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ మహేశ్ మంజ్రేకర్ కనిపించబోతున్నాడు. యాత్ర 2 2024 ఫిబ్రవరి 8న విడుదలవుతుంది.