HomeTelugu Big Storiesరెండో పెళ్లి చేసుకోనున్న '7/G బృందావన కాలని' హీరోయిన్‌

రెండో పెళ్లి చేసుకోనున్న ‘7/G బృందావన కాలని’ హీరోయిన్‌

Sonia aggarwal
టాలీవుడ్‌ లో ‘7/G బృందావన కాలని’ సినిమాతో పరిచయమైన బ్యూటీ సోనియా అగర్వాల్‌. తెలుగులో ఆమె హీరోయిన్‌గా కనిపించింది ఒక్క సినిమానే అయినా ఇక్కడ బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన ఆమె కొద్ది రోజులకు తెరపై కనుమరుగైంది. తనను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన తమిళ డైరెక్టర్‌ సెల్వరాఘవన్‌ను 2006లో ప్రేమ వివాహం చేసుకుంది.

Sonia aggarwal1

ఈ క్రమంలో వ్యక్తిగత కారణాలతో 2010లో భర్తకు విడాకులు ఇచ్చింది సోనియా. విడాకుల తర్వాత తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సోనియా జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ సినిమాలో తళుక్కుమ్మంది. ఇక అప్పటి నుంచి సినిమాల్లో క్యారెక్టర్‌ అర్టిస్టుగా, సహా నటిగా చేస్తూ పలు టీవీ షోలు చేస్తూ వస్తోంది. విడాకుల అనంతరం ఒంటరిగా ఉంటున్న ఆమె తాజాగా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఓ డైరెక్టర్‌తో సోనియా సన్నిహితం ఉంటుందట. ఈ క్రమంలో అతడినే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Sonia aggarwal2

గతంలో కూడా సోనియా రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సోనియా రెండో పెళ్లి వ్యవహరం తెరపైకి వచ్చింది. ఆమె రెండో పెళ్లికి సిద్దమైందని, త్వరలోనే ఓ డైరెక్టర్‌ను వివాహం చేసుకొనుందంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై నటి సోనియా అగర్వాల్‌ స్పందించే వరకు వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu