బాలీవుడ్ ముద్దగుమ్మ సోనమ్ కపూర్ లాక్డౌన్ కారణంగా ఢిల్లీలోని తన ఇంటికే పరిమితమయ్యారు. భర్త ఆనంద్ అహుజాతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో తీసుకున్న ఫొటోల్ని ఆమె సోషల్‌మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా ఫాలోవర్స్‌తో పంచుకుంటున్నారు. ‘క్వారంటైన్ ఫొటోలు’ అనే క్యాప్షన్‌తో ఆమె షేర్ చేసిన వంటగది, గార్డెన్, బెడ్రూమ్లో దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఢిల్లీలోని ఈ బంగ్లా విలువ రూ.173 కోట్లని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు సోనమ్ ఇంటిపై అనేక కథనాలు రాస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఆనంద్ ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. 2018లో వీరి వివాహం జరిగింది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరు ఆపై పెద్దల సమ్మతితో ఒక్కటయ్యారు.