ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవాలంటే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలంటున్నారు డాక్టర్లు. వీటిని మనం ఎలా పెంచుకోవాలో బాలీవుడ్ నటి మనకు 3 చిట్కాలు చెబుతోంది. దీనికి సంబంధించి ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సొనాలి బింద్రే క్యాన్సర్ బారినపడి చికిత్స అనంతరం కోలుకున్న సంగతి తెలిసిందే. తనకు క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత పాటించిన ఈ ఆరోగ్య సూత్రాలను అభిమానులతో పంచుకుంది.
ముఖ్యంగా మూడు ఆరోగ్య సూత్రాల్లో ఒకటి ముఖానికి ఆవిరి పట్టడం.. రెండోది గ్లాసు వేడినీళ్లు తాగడం.. మూడోది యాపిల్, క్యారెట్, అల్లం, బాదం, ఉసిరి, కొద్దిగా పసుపు ఇలాంటి జ్యూస్‌లు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని సూచించారు. నాకు క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి ఈ 3 చిట్కాలను పాటిస్తున్నా. ఇవి నా జీవనశైలిలో భాగం అయిపోయాయి అంటోంది సొనాలి బింద్రే.