టాలీవుడ్ హీరో.. నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో నటించడం లేదని బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా స్పష్టం చేశారు. ‘రూలర్’ తర్వాత బాలయ్య ఈ సినిమాలో నటించబోతున్నారు. ఇటీవల షూటింగ్ ఆరంభమైంది. ఇందులో హీరోయిన్ ఎవరన్నదీ ఇంకా ప్రకటించలేదు. ఈ క్రమంలో బాలయ్య సరసన సోనాక్షి నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం సంజయ్‌దత్‌ను సంప్రదించారని సమాచారం. అయితే ఈ ప్రచారంపై సోనాక్షి స్పందించారు. ‘బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్గా నన్ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. నా తర్వాతి ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో రాబోతోంది’ అని సోనాక్షి ట్వీట్ చేశారు.
సోనాక్షి ప్రస్తుతం ‘దబాంగ్ 3’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబరు 20న విడుదల కాబోతోంది. మరోపక్క సోనాక్షి ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’లో నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ హీరో. ఇందులో రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో సినిమా విడుదల కాబోతోంది.
There are some reports of me being roped in a film helmed by Balakrishna and Boyapati Sreenu. I'd just like to clarify that this isn't true, and I'll be making an announcement of my next project very very soon!
— Sonakshi Sinha (@sonakshisinha) December 16, 2019