దబాంగ్ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా ట్విట్టర్ అకౌంట్ నుంచి తప్పుకుంటుందట. మన: శాంతిని కాపాడు కోవడానికి, నెగిటివిటికి దూరంగా ఉండటానికి ట్విట్టర్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేశానని సోనాక్షి తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శనివారం వెల్లడించింది.
మీ మన:శాంతిని కాపాడుకుకోవడానికి మొదట చేయవలసింది నెగిటివిటికీ దూరంగా ఉండటం. ఇది ట్విట్టర్ కంటే ఎక్కువ ఇంకెక్కడ ఉండదు. ఛలో, నేను నా అకౌంట్‌ను డీయాక్టివేట్ చేస్తున్నాను’ అని సోనాక్షి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు కామెంట్ సెక్షన్‌ను కూడా సోనాక్షి డిసేబుల్ చేసింది. ఇప్పటి వరకు సోనాక్షి 1320 పోస్టులను చేశారు. ఆమెకు 18.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో స్టార్ కిడ్స్‌ని అన్ ఫాలో చేస్తూ, ట్రోల్ చేస్తున్న ఈ తరుణంలో సోనాక్షి ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని అంతా భావిస్తున్నారు.