HomeTelugu TrendingSonakshi Sinha: ఇద్దరు మహిళల మధ్య రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానంటున్న బ్యూటీ

Sonakshi Sinha: ఇద్దరు మహిళల మధ్య రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానంటున్న బ్యూటీ

Sonakshi Sinha

Sonakshi Sinha: ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకున్నాయి. ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన సంజయ్ లీల బన్సాలి.. తాజాగా ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

హీరమండి అనే టైటిల్ వచ్చిన ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ కు విశేషమైన స్పందన వస్తుంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో నటించిన ఆర్టిస్టులకు మంచి ప్రశంసలు దక్కాయి. సోనాక్షి సిన్హా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

స్వతంత్రం సాధించాక ముందు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.. ఈ సిరీస్ లో ఇద్దరు మహిళలు రొమాన్స్ చేసే సన్నివేశం ఉంది. దీన్ని ఎలా మేనేజ్ చేశారన్న ప్రశ్నకు సోనాక్షి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘మొదట్లో, భన్సాలీ నాకు పాత్ర గురించి వివరించాడు. ఆ విషయాన్ని హీరమండి గురించి ఓపెన్‌గా చెప్పారు. కథ విని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను అని సోనాక్షి అన్నారు. మా సిరీస్‌లో ఫరీదాన్ అనే పాత్ర చేశాను. ఆమె పాత్ర సిరీస్ లో స్వలింగ సంపర్కురాలు’ అని సోనాక్షి సిన్హా సినిమా గురించి చెప్పుకొచ్చింది. ఫరీదాన్ ,ఆమె ఇంటి పనిమనిషి మధ్య సన్నివేశం గురించి సోనాక్షి మాట్లాడింది.

‘నేను చేసిన ఫరీదాన్‌ పాత్ర విభిన్నంగా ఉంటుంది. ఆమె 9 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే తనను అమ్మేస్తారు. ఈ కారణంగా ఆమె పురుషులను ద్వేషిస్తుంది. ఈవెబ్ సిరీస్ లో ప్రతిదీ ఓపెన్‌గా చూపబడింది. భన్సాలీ చాలా భిన్నమైన కథను చూపించారు అని సోనాక్షి అన్నారు. ఈ సినిమాలో ఒక్కో క్యారెక్టర్‌కి ఒక్కో రకమైన ప్రాధాన్యత ఇచ్చారు.

ఈసిరీస్‌లో సోనాక్షి పాత్రకు ప్రశంసలు లభించాయి. ఈ సిరీస్ లో లాహోర్‌లోని రెడ్‌లైట్ ఏరియా హీరామండి కథతో ఈ సిరీస్ ఉంటుంది. బ్రిటీష్ హయాంలో వారి పరిస్థితి ఎలా ఉందో ఈ సిరీస్ ద్వారా చూపించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్ హీరమండి వెబ్ సిరీస్‌లో నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu