ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జా (39) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన 1980లో బెంగుళూరులో జన్మించారు. ఈయన యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు. 2009లో నటుడిగా కెరీర్ ప్రారంభించారు ఆయన వాయుపుత్ర సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకి గాను అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2020లో ‘సింగా’, ‘ఖాకీ’, ‘ఆద్యా’, ‘శివార్జున’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆయన చేతిలో ఇప్పుడు ‘రాజమార్థాండా’, ‘ఏప్రిల్’, ‘రణం’, ‘క్షత్రేయ’ సినిమాలు ఉన్నాయి. ఓ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. స్టార్ హీరోగా దూసుకుపోతున్న సమయంలో అర్ధాంతరంగా చనిపోవడం అభిమానులతో పాటు కన్నడ ఇండస్ట్రీ కూడా జీర్ణించుకోలేకపోతుంది.
2018 మే 2న చిరంజీవి సర్జా, నటి మేఘనా రాజ్‌ను వివాహం చేసుకున్నారు. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం తమ పెళ్లి జరిగిందని, రెండేళ్లు పూర్తయిందని 2020 మే 2న మేఘనా రాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు. ఆమె తెలుగులో ‘బెండు అప్పారావు’, ‘లక్కీ’ చిత్రాల్లో నటించింది.
Also Read: rajasekhars daughter extends apology