Bigg Boss 8 Telugu Highlights:
ఈ వారం బిగ్ బాస్ తెలుగు 8 హౌస్‌లో “ఓటు ఆఫ్ అప్పీల్” టాస్క్ కారణంగా పెద్ద డ్రామా జరుగుతోంది. నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన టాస్క్ మళ్లీ వారిద్దరి మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టింది. గతంలో సర్దుకుపోయినట్లుగా కనిపించిన వీరిద్దరి మధ్య ఈ సారి టాస్క్ సమయంలో విభేదాలు పెరిగాయి. నిఖిల్ ప్రవర్తన ఈసారి తప్పుగా ఉండడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ టాస్క్‌కు సంచాలకురాలిగా ఉన్న ప్రేరణ, నిఖిల్‌కు మద్దతుగా వ్యవహరించేందుకు ప్రయత్నించటం కూడా నిఖిల్ కి మైనస్ అయింది. టాస్క్ సమయంలో, ఆ తర్వాత కూడా నిఖిల్ గౌతమ్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. అయితే, గౌతమ్ ధైర్యంగా నిలబడి, తన వాదనను స్పష్టంగా చెప్పడం ప్రేక్షకులకి బాగా నచ్చింది.
ఈ ప్రవర్తన ప్రేక్షకుల నుండి మంచి అభిప్రాయాలను తెచ్చిపెట్టింది. ఇతర హౌస్‌మేట్స్ విష్ణు ప్రియ, నిఖిల్ వైపు మద్దతుగా ఉండి, గౌతమ్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కానీ గౌతమ్ తన శాంతతను కోల్పోకుండా, తన వాదన కొనసాగించారు. అయితే, నిఖిల్ ఈ పరిణామాలను weekend ఎపిసోడ్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించి, గౌతమ్‌పై శారీరక దాడి ఆరోపణలు చేశారు.
ఈ ఉద్రిక్తతల మధ్య, నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌లో నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన ఘటనలపై వీడియోలను చూపించే అవకాశం ఉంది. ఇది ఎవరి తప్పుడు ప్రవర్తన అనేది ఖచ్చితంగా అప్పుడు తెలుస్తుంది.