గుంటూరు జిల్లా తెనాలిలో సాంఘిక నాటక పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ప్రముఖ సినీ నటుడు మురళీ శర్మ హాజరయ్యారు. రంగస్థల నాటిక, నాటక కళాకారుల అభ్యున్నతి కోసం ఏర్పాటుచేసిన సాంస్కృతిక సంస్థ కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి.
ఈ సందర్భంగా మురళీ శర్మను కళల కాణాచి, వేద గంగోత్రి సంస్థలు ఘనంగా సత్కరించి ‘నట విశిష్ణ’ బిరుదును ప్రదానం చేశాయి. తెనాలి వ్యాస్తవ్యులు, ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త దాసరి కిరణ్ కుమార్ ఈ సభలో మురళి శర్మను గజమాలతో సత్కరించారు. సెలెబ్రెటీ బుక్ ఆఫ్ రికార్డ్స్ డైరెక్టర్లు జి.వి.యన్ వరప్రసాద్, విస్సు సెలబ్రిటీ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పిస్తూ రంగస్థల కళాకారుడిగా రంగస్థల నటులను ప్రోత్సహించటానికి శ్రమ తీసుకుని ముంబై నుండి తెనాలి వచ్చిన మురళి శర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.