బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌పై మరోసారి ట్రోలింగ్ కి గురైంది. తన ప్రియుడు రణబీర్ కపూర్ ని ఇటీవలే.. వివాహమాడిన ఈ ముద్దుగుమ్మ షూటింగ్ లో బిజీగా మారింది. ఇకపోతే తాజాగా అలియా ముంబైలో ఓ యాడ్ షూటింగ్ కోసం వెళుతూ మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ఇక ఈ వీడియోలో అలియా, దీపికా లా రెడీ అవ్వడమే ట్రోలింగ్ కి కారణం. బ్లూ కలర్ లూస్ టాప్ లో మధ్య పాపిడి తీసి.. పైకి ముడి(బన్) పెట్టి కనిపించింది. ఇక దీంతో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఏంటి అలియా.. దీపికా లా తయారయ్యావ్ అని కొందరు అంటుండగా.. రణబీర్ ఇంకా దీపికను మర్చిపోలేకపోతున్నాడేమో.. అందుకే ఆమెలా రెడీ అవుతుంది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే దీపికా పెళ్లి తరువాత ఎక్కువగా ఇదే హెయిర్ స్టైల్ లో కనిపిస్తుంది. దీంతో అలియా, దీపికాను ఫాలో అవుతుందని, భర్త కోసమే ఇదంతా చేస్తుందని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/reel/CcvOSuVqsNS/?utm_source=ig_web_copy_link