Sobhita Dhulipala in IMDb Top 10 Indian Stars:
2024 సంవత్సరానికి IMDb విడుదల చేసిన టాప్ 10 అత్యంత ప్రాచుర్యం పొందిన భారతీయ స్టార్ల జాబితాలో త్రిప్తి డిమ్రి అగ్రస్థానంలో నిలిచారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, అలియా భట్ వంటి పెద్ద స్టార్‌లను వెనక్కు నెట్టి, త్రిప్తి ఈ ఘనత సాధించారు. ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా సందర్శకుల పేజీ వ్యూస్ ఆధారంగా ఈ జాబితా రూపొందించబడింది.
అయితే అందరికంటే షాకింగ్ గా నిలిచింది మాత్రం ఐదవ స్థానంలో ఉన్న శోభిత దూళిపాల పేరు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ ఎవర్గ్రీన్ స్టార్ హీరోయిన్ సమంత లాంటి స్టార్లను సైతం దాటి ఆమె ఐదవ స్థానాన్ని సాధించడం ఫాన్స్ కి కూడా ఒకరకంగా షాక్ ఇచ్చింది.
IMDb 2024 టాప్ 10 భారతీయ స్టార్లు:
1. త్రిప్తి డిమ్రి
2. దీపికా పదుకొణె
3. ఇషాన్ ఖట్టర్
4. షారుఖ్ ఖాన్
5. శోభిత ధూళిపాళ
6. షర్వరీ వాఘ్
7. ఐశ్వర్య రాయ్ బచ్చన్
8. సమంతా రూత్ ప్రభు
9. అలియా భట్
10. ప్రభాస్
ఇండియన్ స్టార్ల గ్లోబల్ ఫేమ్
ఈ జాబితా ద్వారా ఇండియన్ స్టార్ల గ్లోబల్ గుర్తింపును అర్థం చేసుకోవచ్చు. త్రిప్తి డిమ్రి లాంటి రైజింగ్ టాలెంట్లు ఇప్పుడు షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ వంటి లెజెండ్స్‌తో పాటు నిలబడుతున్నారు. మరోవైపు ఒక్క పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కూడా లేని శోభిత ధూళిపాల లాంటివారు ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్ లను దాటి మరి ముందంజలో ఉంటున్నారు.
ALSO READ: Pushpa 2 మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూళ్లు చేసిందంటే!