Devara trailer:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో.. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత.. ప్రేక్షకుల ముందుకి రాబోతున్న రెండవ సినిమా దేవర. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమాలోని మొదటి భాగం.. దేవర పార్ట్ 1 ఈనెల 27వ తేదీన విడుదల కోసం అవుతోంది.
ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల అయింది. అయితే సినిమా మీద అంచనాలు పక్కన పెడితే.. సినిమా రిజల్ట్ మీద మాత్రం ఫాన్స్ కి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి.
మొదటగా రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరో అయినా నెక్స్ట్ సినిమాతో ఫ్లాప్ అందుకుంటారు అని ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఒక సెంటిమెంట్ ఉంది. గతంలో రాజమౌళితో కలిసి పనిచేసినప్పుడు కూడా ఎన్టీఆర్ ఫ్లాప్స్ అందుకున్నారు. ఇప్పుడు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత.. వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందేమోనని ఫ్యాన్స్ కలవర పడుతున్నారు.
పోనీ ఆ సెంటిమెంట్ పక్కన పెట్టేసి కేవలం సినిమా కంటెంట్ గురించి చూసినా కూడా.. ఏది ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేలాగా కనిపించడం లేదు. సినిమా పోస్టర్లకు యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో పవర్ ఫుల్ డైలాగ్ తప్ప ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమీ లేదు. అయితే సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు చాలా బాగా హిట్ అయ్యాయి.
అయితే చుట్టమల్లె పాట ట్యూన్స్ కాపీ కొట్టినట్లు ఉన్నాయి అని సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరిగింది. మరోవైపు దావుడి పాట అసలు సినిమాలోనే ఉండదట. కేవలం రోలింగ్ టైటిల్స్ సమయంలో మాత్రమే వస్తుంది. ఇక ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ సంగతి చూసినా కూడా.. ట్రైలర్ లో చాలా వరకు ఆచార్య సినిమా రిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి.
దేవర కంటే ముందు కొరటాల దర్శకత్వం వహించిన సినిమా ఆచార్య. అప్పటిదాకా ఫ్లాప్ అంటే ఏంటో తెలియని కొరటాల మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్నారు. దీంతో దేవర పరిస్థితి ఏంటో అని ఫాన్స్ లో అనుమానాలు మొదలయ్యాయి. మరొకవైపు సినిమా రన్ టైం ఏకంగా రెండు గంటల 58 నిమిషాలు ఉంటుంది అని తెలుస్తోంది.
Read More: Devara: మళ్ళీ పాదఘట్టం వద్దు బాబోయ్
సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటేనేమో.. కథ చాలా రొటీన్ రివెంజ్ డ్రామా లాగా అనిపిస్తుంది. సినిమాకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా.. దర్శక నిర్మాతలు రన్ టైం విషయంలో ఏమాత్రం తగ్గకపోవడం ఫాన్స్ ని ఇంకా నిరాశకు గురిచేస్తోంది. మరి కొద్ది రోజుల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.