Homeతెలుగు వెర్షన్అదిమూలపు సురేష్ గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో ఆయన పరిస్థితేంటి ?

అదిమూలపు సురేష్ గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో ఆయన పరిస్థితేంటి ?

adimulapu suresh
ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే..  అదిమూలపు సురేష్.  ప్రస్తుతం ప్రజల్లో అదిమూలపు సురేష్ పరిస్థితేంటి ?,  వచ్చే ఎన్నికల్లో అదిమూలపు సురేష్ గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. అదిమూలపు సురేష్ ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురంలోని దళిత క్రిస్టియన్ విద్యావంతుల కుటుంబంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సురేష్ కర్ణాటక లోని మంగళూరు దగ్గర ఉన్న ఎన్. ఐ. టి సురత్కల్ నుండి సివిల్ ఇంజినీరింగ్ లో  బీ ఈ, హైదరాబాద్ జేఎన్ టీయూ నుండి కంప్యూటర్ సైన్స్ లో ఎం.టెక్ మరియు అనంతపురం జేఎన్ టీయూ నుండి కంప్యూటర్ సైన్స్ లో పి.హెచ్.డి పూర్తి చేశారు. సురేష్ రాజకీయాల్లో రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ లో ఏఈఈ గా పనిచేస్తూ సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించి ఇండియన్ రైల్వేస్ సర్వీస్ కు ఎంపికయ్యారు. రైల్వేస్ అధికారిగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పనిచేశారు. సురేష్ కుటుంబ నేపథ్యం లోకి వెళ్తే..  ఆయన తండ్రి శామ్యూల్ జార్జ్ పశ్చిమ ప్రకాశం జిల్లాలో ప్రముఖ విద్యావేత్త మరియు అధ్యాపకుడు. మార్కాపురం కేంద్రంగా విద్యా సంస్థలు స్థాపించి ఆ ప్రాంతంలో కులమతాలకు అతీతంగా అందరి మన్ననలు పొందారు.

సురేష్ రాజకీయాల పట్ల తొలి నుంచి విముఖత వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ,  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించి 2009 ఎన్నికల్లో యర్రగొండపాలెం రిజర్వ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ మరణం తర్వాత కొంత కాలానికి జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకొని 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2016 తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేష్ సంతనూతలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తూనే యర్రగొండపాలెం నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు చేపట్టి  2019 ఎన్నికల్లో యర్రగొండపాలెం నుంచి పోటీ చేసి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. 2019 జగన్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టి 2022 వరకు కొనసాగారు. 2022 లో మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
 

ఇంతకీ,  రాజకీయ నాయకుడిగా  అదిమూలపు సురేష్ గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో అదిమూలపు సురేష్పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో అదిమూలపు సురేష్ పరిస్థితేంటి ?, మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ అదిమూలపు సురేష్ కి ఉందా ?, చూద్దాం రండి. అదిమూలపు సురేష్ వ్యక్తిగతంగా మరియు రాజకీయంగా వివాదరహితుడిగా తన ఇమేజ్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు విశ్వాస పాత్రుడని ముద్ర ఉంది. ఇప్పుడు ఆ ముద్రే ఆయన పై వ్యతిరేఖత పెంచేలా ఉంది. పైగా సురేష్ వల్ల తమకు ఎలాంటి  ప్రయోజనం జరగడం లేదు అని ప్రజల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. దీనికితోడు సురేష్ కుటుంబ సభ్యుల పై పలు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. 
 
అయినప్పటికీ అదిమూలపు సురేష్ కి ఇంకా ఓ వర్గం ప్రజల్లో బలమైన ఫాలోయింగ్ ఉంది. ఐతే, అదిమూలపు సురేష్ వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే.. గెలిచే పార్టీ వైపు ఉండాలి.  అందుకే,  ఈ సారి  జగన్ రెడ్డి పార్టీ నుంచి పోటీ చేయకుండా జనసేన లేదా టీడీపీ నుంచి పోటీ చేయాలనీ ఆయన సన్నిహితులు కోరుతున్నారు. కానీ, సురేష్ మాత్రం తానూ జగన్ రెడ్డి వెంటే ఉంటాను అని ఇప్పటికే స్పష్టం చేశారు.  మరి సురేష్ జగన్ రెడ్డి వైపే ఉంటే.. ఆయన విజయ అవకాశాలు అనుమానంగానే ఉన్నాయి.  పర్సనల్ గా అదిమూలపు సురేష్  గ్రాఫ్ బాగున్నా..  ఈ సారి సురేష్ గెలిచే వరకూ నమ్మలేం. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu