Rajamouli Stamp:
రాజమౌళి పేరు ఇప్పుడు ఒక బ్రాండ్. జక్కన్న గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆయన సినిమాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సినిమా అయిపోగానే పడే యాన్ ఎస్ ఎస్ రాజమౌళి ఫిలిం అనే స్టాంప్ పడగానే ఫాన్స్ కి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది.
మామూలుగా ప్రతి సినిమా ఆఖరిలో డైరెక్టర్ ఏ ఫిలిం బై అంటూ తమ పేరు వేసుకుంటారు. కానీ మిగతా డైరెక్టర్లు అందరితో పోలిస్తే రాజమౌళి కి విభిన్న స్టైల్ ఉంటుంది. అందరిలాగా పేరు రాకుండా, యాన్ ఎస్ ఎస్ రాజమౌళి ఫిలిం అంటూ స్టాంపు పడుతుంది. దాని వెనుక ఒక చిన్న కథ కూడా ఉందట. తన పేరుని స్టాంప్ రూపంలో రాజమౌళి ఎందుకు వేసుకుంటున్నారు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
2003లో సింహాద్రి విడుదల సమయంలో.. సినిమా ఆఖరిలో ఏ ఫిలిం బై రాజమౌళి అని పెడుతున్నప్పుడు.. నిర్మాత కేవలం తన పేరు మాత్రమే ఎందుకు.. ఇది టీం మొత్తం చేసిన సినిమా కదా అని అడిగారట. కాబట్టి రాజమౌళి సై సినిమా విషయంలో.. ఇది తన సినిమానే అని తెలియడం కోసం స్టాంప్ లాగా తన పేరుని వేసుకున్నారట. ఆ తరువాత సినిమాలకి కూడా రాజమౌళి కి అలాగే అలవాటు అయిపొయింది.
కొన్నేళ్ల తర్వాత రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన తర్వాత.. స్టాంపు తీసేద్దామని అనుకున్నారట. కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం దానికి ఒప్పుకోలేదట. యాన్ ఎస్ ఎస్ రాజమౌళి ఫిలిం అనే స్టాంప్ పడకపోతే రాజమౌళికి సినిమా నచ్చలేదేమోనని అభిమానులు అనుకునే అవకాశం ఉందని.. కాబట్టి కచ్చితంగా స్టాంపు ఉండి తీరాల్సిందే అని డిస్ట్రిబ్యూటర్లు పట్టు పట్టారట.
అలా ఒక చిన్న ఆలోచనతో మొదలైన రాజమౌళి స్టాంప్ ఇప్పుడు బ్రాండ్ లోగో లాగా మారిపోయింది. నిజంగానే యాన్ ఎస్ ఎస్ రాజమౌళి ఫిలిం అనే స్టాంప్ పడకపోతే అది రాజమౌళి సినిమా అని ఫ్యాన్స్ కూడా నమ్మరేమో.