టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు పిట్టకథ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు స్లమ్ డాగ్ హస్బెండ్ తో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడులైంది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చేతుల ఈ ట్రైలర్‌ని రిలీజ్ చేశాడు.
ఈ ట్రైలర్ లోనే కథ మొత్తం దర్శకుడు చెప్పేయడం విశేషం. స్లమ్ లో ఉండే హీరో హీరోయిన్ టీనేజ్ లోనే లవ్ లో పడతారు. దీంతో రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేయడం కోసం పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళని బలవంతం చేస్తారు. అయితే హీరోకి ఏదో దోషం ఉండటంతో అది పోవాలంటే ముందు ఇంకొకరితో పెళ్లి జరగాలని తరువాత ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని చెబుతారు.
దీంతో హీరో ఓ కుక్కని పెళ్లి చేసుకుంటాడు. తరువాత ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు. అయితే కుక్క అతని మీద కోర్టుకి వెళ్తుంది. మొదటి భార్య ఉంటుండగా మరో పెళ్లి చేసుకోకూడదు అంటూ లాయర్ సప్తగిరి కోర్టులో వాదిస్తాడు. విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్ళికి రెడీ అవుతున్నాడని హీరోని అరెస్ట్ చేసి పోలీసులు తమశైలిలో ట్రీట్మెంట్ ఇస్తారు.
బ్రహ్మాజీ సప్తగిరి కోర్టులో వాదనలు ఫన్ టచ్ తో ఉన్నాయి. ఏఎస్ శ్రీధర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక బీమ్స్ సంగీతం అందించారు. మైక్ మీడియా బ్యానర్ పై అప్పి రెడ్డి వెంకట్ అన్నపరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉయ్యాల జంపాల సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించిన ప్రణవి మానుకోండ హీరోయిన్ గా పరిచయం అవుతోంది.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ టీజర్