స్కంద: రామ్‌ ఫొటోలు వైరల్‌


రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం స్కంద. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. RAPO20గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో రామ్‌ లుక్‌ కూడా చాలా కొత్తగా ఉంది. మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ స్కందలో శ్రీలీల, సయీ మంజ్రేకర్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు.

ఈ సినిమా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ ప్రమోషన్స్‌ మొదలు పెట్టారు. రామ్‌, శ్రీలీల ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజువల్స్‌, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ మూవీని ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్పణలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్ ప‌తాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

స్కంద నుంచి విడుదల చేసిన నీ చుట్టూ చుట్టూ, గండరబాయ్, డుమ్మారే డుమ్మారే పాటలు నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ.. మ్యూజిక్‌ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై రామ్-శ్రీలీల ఇరగదీసే డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేయబోతున్నారని ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu