HomeTelugu TrendingSJ Surya in Indian 2: శంకర్ సినిమాకి అంత సీన్ ఉందా?

SJ Surya in Indian 2: శంకర్ సినిమాకి అంత సీన్ ఉందా?

SJ Surya in Indian 2
SJ Surya in Indian 2 requests a record breaker

SJ Surya in Indian 2:

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా భారతీయుడు 2. ప్రముఖ కోలీవుడ్ నటుడు ఎస్ జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో ఎస్ జే సూర్య ఒక విభిన్న పాత్రలో కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. అయితే తాజాగా సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఎస్ జె సూర్య కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

భారతీయుడు 2 సినిమాలో ఆయన పాత్ర తక్కువ సేపే ఉంటుందట. ఉండేది తక్కువ సమయం అయినప్పటికీ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయని చెబుతున్నారు ఎస్ జే సూర్య. ఈ సినిమాని కచ్చితంగా తమిళ్లో 1000 కోట్లు కలెక్షన్లు అందుకున్న మొదటి సినిమాగా చేయాలని ఎస్ జే సూర్య అభిమానులను కోరారు.

ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లలో శంకర్ కూడా ఒకరు. కానీ ఆయన బ్లాక్ బస్టర్ లు అయిన రోబో వంటి సినిమాలు కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకోగలుగుతున్నాయి. ఈ సమయంలో శంకర్ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయి 1000 కోట్లు కలెక్షన్లు అందుకునే అవకాశాలు చాలా చాలా తక్కువ.

పైగా భారతీయుడు 2 సినిమా మీద అంచనాలు చాలా తక్కువగానే ఉన్నాయి. 1996లో విడుదలైన భారతీయుడు సినిమా బ్లాక్ బస్టర్ సినిమానే. కానీ ఇండియన్ 2 మీద మాత్రం ఆ రేంజ్ అంచనాలు లేవు. మరోవైపు ప్రభాస్ అభిమానులు కల్కి సినిమా తమిళనాడులో సరిగ్గా ఆడకపోతే భారతీయుడు 2 సినిమాని కూడా థియేటర్లలో చూడమని వాగ్దానాలు చేస్తున్నారు.

రామ్ చరణ్ అభిమానులు కూడా గేమ్ చేంజర్ సినిమా ఇంకా పూర్తి కాకపోవడంతో శంకర్ మీద కోపంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శంకర్ తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు కూడా పెద్దగా ప్లాన్ చేయడం లేదు. కానీ భారతీయుడు 2 సినిమా 1000 కోట్లు కలెక్షన్లు అందుకోవాలి అంటే తమిళనాడులో మాత్రమే కాక తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ లో మంచి కలెక్షన్లు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

SJ Surya in Indian 2:

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే మాత్రం భారతీయుడు 2 సినిమా ఆ రేంజ్ సక్సెస్ అయ్యేలా అయితే కనిపించడం లేదు. మరి సినిమా విషయంలో ఎస్ జె సూర్య కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. ఈ సినిమా జూలై 12న థియేటర్లలో విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu