సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, తమ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది ఆ కుటుంబం.
శివ శంకర్ మాస్టర్ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్ మాస్టర్‌గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటుడిగానూ అలరించారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన డ్యాన్స్ షోలకు జడ్జ్‌గానూ వ్యవహరించారు.